మహాత్మా గాంధీ గ్రామీణ జాతీయ ఉపాధి హామీ పథకం కింద పని చేస్తున్నవారు ఎవరైతే ఉన్నారో వారి యొక్క ఆధార్ నంబర్లు ఇచ్చి వారికి ఎప్పుడు బ్యాంకులో అమౌంట్ లు పడ్డాయో తెలుసుకోవచ్చు. దీనికోసం ముందుగా కింద ఇచ్చిన లింక్ ను ఓపెన్ చేయాలి.
Click Here for Website,వెబ్ సైట్ కోసం ఇక్కడ నోక్కండి.
ఇలా ఓపెన్ చేయగానే క్రింద చూపించిన పిక్చర్ లాగా వెబ్సైట్ ఓపెన్ అవుతుంది.అందులో వెబ్సైటు చివరికి వెళ్ళినట్లయితే అక్కడ మనకు లుకింగ్ ఫర్ సంథింగ్ అనే ఒక ఆప్షన్ కనబడుతుంది. అది ఈ చిత్రంలో చూపించినట్లు గా ఉంటుంది.అందులో మీరు సెలెక్ట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేసినట్లయితే కొన్ని వివరాలు వరుసగా కనబడతాయి.అందులో చివరగా యుఐడి అనే ఒక ఆప్షన్ ఉంటుంది దాని పైన క్లిక్ చేయగానే ఈ క్రింద చూపిన విధంగా విండో ఓపెన్ అవుతుంది.
అందులో మీ యొక్క ఆధార్ నెంబర్ను ఎంటర్ చేసి క్రింద ఇచ్చిన కోడ్ నెంబరు ఎంటర్ చేసి GO పైన నొక్కగానే మీకు ఏ నెలలో ఎంత అమౌంట్ మీ బ్యాంక్ అకౌంట్ లో పడిందో మొత్తం వివరాలు అన్నీ ఒక పేజీలో ఓపెన్ అవుతాయి.
No comments:
Post a Comment